ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కారం

రోడ్డెక్కి సమ్మెలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతికాదు

ఉద్యోగుల పట్ల సీఎం వైయస్‌ జగన్‌ సానుకూల వైఖరితో ఉన్నారు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 

విశాఖపట్నం: ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, ఆవేశాలకు గురికాకుండా, సంయమనం కోల్పోకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కోరారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సానుకూల వైఖరితో ఉన్నారన్నారు. ఉద్యోగుల కోరికలు, ఇబ్బందులు వారికి ఉన్నాయి.. ప్రభుత్వానికి ఉండాల్సిన సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్నారు. దయచేసి చర్చలకు ముందుకు రావాలని కోరారు. రోడ్డు ఎక్కి సమ్మెలు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతికాదన్నారు. 

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఆంధ్రరాష్ట్ర దురదృష్టమని, ఏ సమస్య వచ్చినా దాన్ని రాజకీయంగా ఎలా మల్చుకోవాలి.. సీఎం వైయస్‌ జగన్‌పై ఎలా బురదజల్లాలని బాబు కుట్ర చేస్తున్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.  మూడు రాజధానులు, ఇంగ్లిష్‌ మీడియం, ఇళ్ల పట్టాలు ఏ మంచి పనిచేద్దామన్నా  కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నాడని, ఉద్యోగుల సమస్యను కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు కుయుక్తులు పన్నడం దుర్మార్గమన్నారు.
 
 

Back to Top