యువతకు సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో మంత్రి  అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువతకు పెద్దపీట వేశారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖలోని  ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్లబాబూరావు తదితరులు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్‌ యువత చేతుల్లో ఉందని ఎప్పుడో వివేకానంద చెప్పారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని భారత దేశ యువత శాసిస్తుందన్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top