సహాయక చర్యలను  పర్యవేక్షిస్తున్న మంత్రి అవంతి

విశాఖ: విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో మంత్రి అవంతి శ్రీనివాస్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గ్యాస్ లీకేజీ తగ్గడంతో ఆర్‌ఆర్‌ వెంకటాపురంతో పాటు చట్టుపక్కల ఉన్న గ్రామాల్లో  సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఆర్ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.  కేజీహెచ్‌తో పాటు విశాఖ కేర్‌, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్న 14 మందికి ప్రాణాపాయం లేదని మంత్రి తెలిపారు. 

Back to Top