విశాఖపట్నం: ఈసీ లేఖ వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వెంటనే స్పందించాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిన్న విడుదలైన లేఖను ఎన్నికల కమిషనర్ రాయకపోతే వెంటనే విచారణ జరిపించాలని డీజీపీని కోరాలని సూచించారు. లేఖ వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తుందన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేకే చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.