తాడేపల్లి: మున్సిపల్ కార్మికుల డిమాండ్‌ల విషయంలో సీఎం వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని.. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ సమ్యలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యాం. సమస్యలపై చర్చించాం. ఓహెచ్‌వో ఇచ్చేందుకు 6 వేలు అలానే ఉంచాలనే డిమాండ్‌కు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వేల రూపాయలు యథాతధంగా ఉంటుంది. జీతంతో పాటు, 6 వేలు OHA కలిపి రూ. 21 వేలు వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ కొనసాగిస్తాం. మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నాం అని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు