ఫేక్‌న్యూస్ ప్ర‌చారం చేసేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం

విద్యా క్యాలెండ‌ర్‌కు అనుగుణంగా స్కూళ్లు ప‌నిచేస్తాయి

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

కడప: విద్యా క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ అపోహలకు గురికావొద్దని సూచించారు. కడపలో మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ఫేక్‌ న్యూస్‌లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. విద్యా క్యాలెండర్‌ ప్రకారం స్కూళ్లు పనిచేస్తాయని పునరుద్ఘాటించారు. పాఠశాలలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
 

Back to Top