జీడిపప్పు ఎగుమతులు 10 శాతం పెరిగాయి

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 2021 నుంచి జనవరి 2022 వరకు 379 మిలియన్‌ డాలర్ల విలువైన జీడిపప్పు ఎగుమతులు జరిగినట్లు  వాణిజ్య శాఖ సహాయ మంత్రి  అనుప్రియ పటేల్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2021 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే జీడిపప్పు ఎగుమతుల్లో 10 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహానికి వాణిజ్య శాఖ ట్రేడ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీమ్‌ (టైస్‌), మార్కెట్‌ యాక్సిస్‌ ఇనిషియేటివ్స్‌ (ఎంఏఐ) స్కీమ్‌ ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పలాస జీడిపప్పు ప్రాసెసింగ్‌, ఎగుమతులను మరింత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని జీడిపప్పు ఎగుమతిదార్ల నుంచి తనకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని అన్నారు.
కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సడలింపులు ప్రకటించిందని చెప్పారు. జీఎస్టీ రిటర్నర్‌లు ఫైలింగ్‌ గడువులో సడలింపుతోపాటు జీఎస్టీ రీఫండ్‌ ఎప్పటికప్పుడు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాలు అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ పలు చర్యలు చేపట్టింది. ఆ రంగం కోసం ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అందులో జీడి పరిశ్రమ కూడా ఉందని ఆమె తెలిపారు. జీడి పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ కాజూనట్‌, కొకోవా డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ 15 రాష్ట్రాల్లో పలు ప్రోత్సాహక చర్యలను చేపట్టినట్లు చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్య కాలంలో దేశంలోని లక్ష హెక్టార్లలో జీడి పరిశ్రమను ఆదుకోవడానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు

Back to Top