దాడులకు పాల్పడితే సహించం

ఎమ్మెల్యేలపై దాడి చేయించడం సిగ్గు చేటు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం హైపవర్‌ కమిటీ చర్చ జరుగుతుంటే టీడీపీ దిగజారుడు రాజకీయాలు

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి: హింసను ప్రేరేపించి దాడులకు పాల్పడితే సహించేది లేదని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ నేతల దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మేం ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఎన్ని జరిగినా కూడా మా నాయకుడు చూపిన బాటలో ఎక్కడా కూడా చిన్న ఘటనకు పాల్పడిన సంఘటన లేదు. మా నాయకుడు వైయస్‌ జగన్‌పై చివరకు హత్యాయత్నం జరిగినా కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త, జగనన్న అభిమానులు సంయమనంతో ఉన్నాం. ఎక్కడా దాడులు చేయలేదు. మాకు చేత కాకకాదు. మా నాయకుడు ఒక పద్ధతి మాకు నేర్పారు. పదేళ్లు ఒక చిన్న హింస లేకుండా నడిపించారు. అధికారం పోయి పట్టు మని పది నెలలు కూడా కాకముందే చంద్రబాబు గల్లీ స్థాయికి దిగజారిపోయి దాడులు చేయిస్తున్నారు. సిగ్గుచేటు. మేం కానీ కన్నెర్ర చేస్తే..దాడులు మొదలు పెడితే చంద్రబాబు..కాదు కదా టీడీపీ నాయకుడు ఒక్కడు కూడా తిరగలేడు. ఈ రోజు చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజధానిపై రెండు కమిటీలు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలపై హైపవర్‌ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రం మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు కేవలం తన రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. చంద్రబాబు మాయలో రైతులు పడొద్దని వేడుకుంటున్నా..మా సీఎం  ఎవరికి అన్యాయం చేయడు. అక్కడక్కడ వంద మందిని పెట్టుకొని మాపై దాడులు చేస్తే భయపడిపోయే ప్రసక్తే లేదు. మేం దాడులు చేయడం మొదలు పెడితే చంద్రబాబు..నీవు కానీ..నీ కొడుకు కానీ ఎవరు కూడా తిరగలేరు. ఒక్కసారి మేం సహనం కోల్పోయి మేం కూడా దాడులకు పాల్పడితే పరిస్థితి వేరేలా ఉంటుంది. చంద్రబాబు వియ్యంకుడు దగ్గబాటి వెంకటేశ్వరరావు గతంలో చెప్పాడు. చంద్రబాబు హింసను ప్రేరేపించి దానిపై పబ్బం గడుపుకోవడం ఆయన నైజమని చెప్పారు. ఇంత నీచానికి దిగజారే వ్యక్తి చంద్రబాబు. ఈ రాష్ట్ర ప్రజలు నీకిచ్చిన తీర్పును చంద్రబాబు గౌరవించాలి. సిగ్గుతెచ్చుకోకుండా ఇంతలా దిగజారితే 23లో రెండే మిగులుతాయి. దాడులపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు. దాడులు చేసేవారంతా కూడా వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి రెచ్చగొడుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమంతో ముందుకు వెళ్తున్నారు. రెచ్చగొడితే చూస్తూ ఊరుకోం. హింసను ఎవరు ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మొన్న మీడియాలో మహిళా యాంకర్‌పై దాడి చేశారు. ఇవాళ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఏదో విధంగా హింసను రెచ్చగొట్టడమే చంద్రబాబు ధ్యేయం. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా చంద్రబాబు వెంటనే అక్కడ వాలి..రాజధాని వల్లే చనిపోయాడని శవ రాజకీయాలు చేస్తున్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top