సీఎం వైయస్‌ జగన్‌కు వీర విధేయులుగా ఉందాం

బీసీలంటే నమ్మకానికి ప్రతీక

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి బీసీలంతా వీరవిధేయులుగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వీర సైనికుల్లా పని చేద్దామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన బీసీల సంక్రాంతి కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌ మాట్లాడారు.. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాత్రమే. ఈ రోజు బాధ్యత తీసుకున్న వారు పదవులతో మీ కులాల సమస్యలు పరిష్కరించుకునేందుకు ఒక వేదికగా ఉంటుందన్నారు. బీసీలంటే నమ్మకానికి ప్రతీక..మనం ఎవరి వెంట నడుస్తామో..వారికి వెన్నుగా ఉండాలని సూచించారు. ఈ రోజు హోదా కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌ను మీరందరూ మరచిపోకుండా అండగా ఉండాలన్నారు. ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. బీసీలందరం వైయస్‌ జగన్‌కు విధేయులుగా, వీర సైనికుల్లా పని చేద్దాం. గతంలో బీసీల గురించి ఎందరో మాట్లాడారు కానీ..ఎవరూ ఏమీ చేయలేదు. చెప్పింది చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌. నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ పదవి ఇవ్వడం సీఎంకు కత్తిమీద సాము లాంటిదే. ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులకు వెన్న తెచ్చే విధంగా నమ్మకంగా, విధేయతగా ఉందామని పిలుపునిచ్చారు. గతంలో బీసీలకు ఎన్టీఆర్‌ కొంత చేసినా..ఆయన తరువాత బీసీలను టీడీపీ పట్టించుకోలేదని విమర్శించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకం ద్వారా బీసీలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. మహానేత ఆశయాలతో వైయస్‌ జగన్‌ బీసీల కోసం పని చేస్తున్నారన్నారు. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, వైయస్‌ జగన్‌కు ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ, ఓపిక, ఆలోచన మరెవ్వరికి లేదన్నారు. మహిళలకు సగం పదవులు ఇచ్చిన ఘనత  వైయస్‌ జగన్‌దే అన్నారు. అందరం కూడా  వైయస్‌ జగన్‌కు చేదోడు,వాదోడుగా ఉందామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కోరారు.
 

Back to Top