అమరావతి: అన్నదాత సుభిక్షంగా ఉండడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ధ్యేయమని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగుగంగ నుంచి 1.3 టీఎంసీ తాగునీరు అందించే ఫైల్‌పై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తొలి సంతకం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. ఇకపై ఇరిగేషన్ శాఖ పారదర్శకంగా ఉంటుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో రైతు సుభిక్షంగా ఉంటాడని వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని, మా పాలనలో దోపిడీ ఉండాదన్నారు. ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్ కమిటీ ముందు ఉంచుతామన్నారు.