సినిమా ఖ‌ర్చెంత‌..? ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌..?

ప్రొడక్షన్‌ కాస్ట్‌ 30శాతం అయితే రెమ్యునరేషన్‌ 70శాతం ఉంది

ప్ర‌జ‌ల‌పై భారంప‌డేలా టికెట్ల రేటు పెంచ‌మ‌న‌డం ఎంతవ‌ర‌కు క‌రెక్ట్‌..?

ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌

నెల్లూరు: ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న క్రేజ్‌ను అమ్ముకుంటున్నాడ‌ని, ప్ర‌జ‌ల‌ను ఉద్ద‌రిస్తాన‌న్న ప‌వ‌న్ త‌క్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు క‌దా అని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ ప్ర‌శ్నించారు. సినిమా టికెట్ల ధరలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. నెల్లూరులో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. . ``టికెట్‌ రేట్‌ తగ్గితే రెమ్యునరేషన్‌ తగ్గుతుందని వాళ్లు బాధపడుతున్నారు. భీమ్లా నాయక్‌, వకీల్‌సాబ్ సినిమాల‌కు పెట్టిన ఖర్చెంత?. పవన్‌కల్యాణ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంత..?. పవన్‌ క్రేజ్‌ని అమ్ముకుంటున్నాడు. ప‌వ‌న్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే టికెట్ ధ‌ర‌ల‌తో న‌ష్ట‌మే ఉండ‌దు. ఒకప్పుడు నేను కూడా బైక్‌ అమ్మి పవన్‌కల్యాణ్‌కి కటౌట్‌లు కట్టాను. ఉన్న డబ్బులు ఊడగొట్టుకున్నా. ఇప్పుడున్న అభిమానుల పరిస్థితి కూడా అంతే. ప్రొడక్షన్‌ కాస్ట్‌ 30శాతం అయితే రెమ్యునరేషన్‌ 70శాతం ఉంది. సినిమాకయ్యే ఖర్చులో 80శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయి. దానికోసం కోట్లాది మంది ప్రజలపై భారంపడేలా సినిమా రేట్లు పెంచమనడం ఎంతవరకు కరెక్ట్`` అంటూ మంత్రి అనిల్‌ మండిపడ్డారు. 

Back to Top