రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు మృతి… వైయస్ జగన్ సంతాపం 

 తాడేపల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త బాధాకరమని పేర్కొన్న వైయ‌స్ జగన్, పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. 
ఈ క్లిష్ట సమయంలో జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీఎన్ నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ప్రార్థించారు.
 

Back to Top