లోకేష్‌.. నువ్వు హెరిటేజ్‌ దున్నపోతువా..?

పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలనే దుర్బుద్ధి ఎందుకు..?

చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా పోలవరం పూర్తిచేసి తీరుతాం

2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం నుంచి నీరందిస్తాం

గడ్డాలు పెంచితే మాస్‌ లీడర్‌ కాలేవు.. అది పుట్టుకతో రావాలి లోకేష్‌

ఆంధ్రా పప్పు అని గూగుల్‌ని అడిగితే లోకేష్‌ ఫొటో చూపిస్తోంది

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనలో టీడీపీ జెండా కొట్టుకుపోయింది

రఘురామకృష్ణ రాజు టీడీపీ ఏజెంట్‌గా మారిపోయాడు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజం

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు వస్తుందని, ఎలాగైనా ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగించాలనే దుర్బుద్ధితో చంద్రబాబు అండ్‌ కో పనిచేస్తున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి ఏజెంట్‌గా మారిపోయిన రఘురామకృష్ణం రాజుతో చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే భాగ్యం ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌కు దక్కిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఆ దిశగానే ప్రణాళిక బద్ధంగా ముందుకుసాగుతున్నామన్నారు. కోవిడ్‌తో ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సారథ్యంలో దాదాపు 3 వేల మందికి పైచిలుకు కార్మికులతో పోలవరం పనులను చేపడుతున్నామ‌ని, కోవిడ్‌ సమయంలోనూ పనులు వేగ‌వంతంగా చేస్తున్న అధికారులు, కార్మికులకు మంత్రి అనిల్‌ ధన్యవాదాలు తెలిపారు.  

ప్రాజెక్టు పూర్తయితే చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని, అది సహించలేని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సంతోషించాల్సిందిపోయి నిర్మాణ పనులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం దుర్మార్గమన్నారు. వయస్సు మీదపడిన చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలంతా ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైతే.. కోవిడ్‌కు భయపడి సంవత్సరం నుంచి ఇళ్ల నుంచి బయటకు రాని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాల‌ని చూడ‌డం సిగ్గుచేటన్నారు. 

లోకేష్‌ది శునకానందం..
ఈ మధ్యకాలంలో ఫ్రస్టేషన్‌ చిన్నబాబు అపోయిన లోకేష్‌.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తాను అంతకంటే ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దొడ్డిదారిన వచ్చి మూడు శాఖలకు మంత్రిగా చేసి.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌.. సీఎం వైయస్‌ జగన్‌ను తిడుతూ శునకానందం పొందుతున్నాడని మండిపడ్డారు. జూమ్‌లో కూర్చొని ముఖ్యమంత్రిని తిడితే పెద్ద నాయకుడిని అయిపోయాను అనుకుంటున్నావా..? సీఎం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఉందా..? అని లోకేష్‌ను ప్రశ్నించారు.

చరిత్ర సృష్టించిన నాయకుడు వైయస్‌ జగన్‌..
తన తండ్రి చనిపోయిన తరువాత రెక్కల కష్టంతో పార్టీ పెట్టుకొని ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేసి ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఒక్క శాతం అయినా ఉందా..? అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. తాత, తండ్రీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ.. డిపాజిట్లు కోల్పోయిన లోకేష్‌కు సీఎం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దేశ ప్రజలంతా లోకేష్‌కు పప్పు అనే బ్రాండ్‌ వేశారని, ఆంధ్రా పప్పు అని గూగుల్‌లో కొడితే లోకేష్‌ ఫొటో వస్తుందని ఎద్దేవా చేశారు. 

వీరత్వం, పౌరుషం పుట్టుకతో రావాలి లోకేష్‌..
పాడి రైతుల మేలు కోసం సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తుంటే.. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతావా..? లోకేష్‌ నువ్వు హెరిటేజ్‌ దున్నపోతువా..? అని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు. ఇన్నేళ్లు హెరిటేజ్‌ను అడ్డంపెట్టుకొని రాష్ట్రంలోని అనేక సహకార సంఘాలను నాశనం చేసింది మీరు కాదా..? ఇంకోసారి సీఎం గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని లోకేష్‌ను హెచ్చరించారు. గడ్డం పెంచగానే మాస్‌ లీడర్‌ అనుకుంటున్నావా..? అది పుట్టుకతో రావాలి. వీరత్వం, పౌరుషం, ప్రజాసేవ చేసే గుణం, నాయకత్వ పటిమ అన్నీ వైయస్‌ఆర్‌ నుంచి వైయస్‌ జగన్‌కు వచ్చాయన్నారు.  

చంద్రబాబు ముదురు కాబట్టే.. 
సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంలో టీడీపీ కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఒకపక్క తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని, 2024లో ఏపీలో కూడా  పీకేయబోతున్నారన్నారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు.. ముదురు కాబట్టే పరిస్థితులను ముందుగానే ఊహించి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నాడన్నారు.  

ఇష్టమొచ్చినట్లుగా ఎల్లోమీడియా రాతలు..
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్‌ ఆలస్యమైతే ఆంధ్రరాష్ట్ర ఆత్మగౌరవం దెబ్బతింటుందా..? సీఎం వైయస్‌ జగన్‌కు అపాయింట్‌మెంట్‌ కొంచెం ఆలస్యమైతే తగిన శాస్తా..? ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఎల్లో మీడియా రాత‌లు రాస్తుంద‌ని మండిపడ్డారు. పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పులను చేయబోమని, ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 ఖరీఫ్‌ నాటికి తప్పనిసరిగా పోలవరం నుంచి నీరు అందిస్తామని మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు.  

Back to Top