మంగళగిరిలో నీ గోచీ ఊడబెరికినా బుద్ధిరాలేదా..?

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజం

లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి

సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదు

లాలూచీ, చీకట్లో కాళ్లుపట్టుకునే సంస్కృతి చంద్రబాబుది

చంద్రబాబు కమీషన్ల కక్కుర్తివల్లే పోలవరం నిర్మాణంలో ఇబ్బందులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వెనక్కు తగ్గే ప్ర‌స‌క్తి లేదు

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని, నారా లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మిడిమిడి జ్ఞానంతో నారా లోకేష్‌ నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. 23 సీట్ల‌కు దిగ‌జార్చి ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీ గోచీ ఊడబెరికారని, మంగళగిరిలో గోచీ ఊడబెరుక్కొన్న లోకేష్‌ కూడా సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడితే ఎలా? అడ్డమైన వ్యక్తులంతా సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 

కమీషన్ల కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని మంత్రి అనిల్‌కుమార్‌ మండిపడ్డారు. చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తిపడడంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. లోకేష్‌కు తెలివితేటలు ఉంటే 2017లో కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌ నోట్‌ చదివి రాష్ట్ర ప్రజలకు వినిపించాలన్నారు. లోకేష్‌ జ్ఞానం, తెలివితేటల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వెనక్కు తగ్గేది లేదు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు కట్టితీరుతామని ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాటం చేస్తామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన, మంచి మనసు వల్ల ఈ రెండేళ్లుగా డ్యాములు అన్నీ నిండి జలకళ సంతరించుకున్నాయన్నారు. మంచి మనిషి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు, రైతుల గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు.  

2010 నుంచి వైయస్‌ జగన్‌పై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు. లాలూచీ పడే సంస్కృతి, చీకట్లో కాళ్లు పట్టుకునే చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. సమస్య ఏదైనా దమ్ము, ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వైయస్‌ జగన్‌కు ఉందన్నారు. ప్రజల మనసులో తనకంటే ఒక స్థానం కల్పించుకొని 151 స్థానాల్లో విజయం సాధించిన సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top