పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు

చిత్తూరు జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.   బెంగళూరులో నిన్న ఉదయం 5.45 గంటలకు కుప్పం పోలీసులు పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, రాత్రి 11.45 గంటలకు అరెస్ట్ చూపించారు.  ఉన్నత న్యాయస్థానాల మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది.  ఇవాళ కుప్పం కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌డంతో న్యాయ‌మూర్తి బెయిల్ మంజూరు చేసింది.
 
అక్రమ కేసులు బనాయించి..
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి గతంలో సీపీఆర్‌వోగా పూడి శ్రీహరి పని చేశారు. ప్రస్తుతం ఆయన వైయ‌స్ఆర్‌సీపీలో మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ క్రమంలో హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగానే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుధవారం వేకువజామున బెంగళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విచారణ పేరుతో కుప్పం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వేధించినట్లు తెలుస్తోంది.  వైద్య పరీక్షల నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి.. తిరిగి కుప్పం పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కుప్పం కోర్టుకు తీసుకెళ్లారు.  

Back to Top