ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ముందుకు వెళ్తాం

మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను హుందాగా నడిపిస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..సభలో ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని, సమావేశాలను హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళతామని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రానికి మంచి నాయకుడు వచ్చాడని ప్రజలకు సంకేతాలు ఇచ్చారని, ఏది చెబుతామో ...అది చేసి తీరాలన్న విధంగా వైయ‌స్‌ జగన్‌ ముందుకు వెళుతున్నారన్నారు. మంత్రులకు కూడా ఎవరైనా తప్పు చేస్తే... వారిని పక్కన పెడతామంటూ ముఖ్యమంత్రి తమకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. తాము నిజాయితీగా ...పనిచేస్తే.. తమ కింద వాళ్లు కూడా అదేవిధంగా పనిచేస్తారన్నారు. తన పాలనతో దేశమంతా వైయ‌స్‌ జగన్‌ను అనుసరించే విధంగా చూపిస్తారని మంత్రి అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top