పోలవరం మహానేత వైయస్‌ఆర్‌ కల

ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఘనత సీఎం వైయస్‌ జగన్‌కు దక్కింది

పోలవరం పేరు చెప్పి చంద్రబాబు వందల కోట్లు దోచేశారు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి: పోలవరం ప్రాజెక్టును దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అంతకు ముందు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు వేయకుండా ఇప్పుడు దాని గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మహానేత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం ప్రాజెక్టు చేపట్టి దానికి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకువచ్చి.. కుడి, ఎడమ కాల్వలు కూడా పూర్తిచేశారన్నారు. వైయస్‌ఆర్‌ కాల్వలు తవ్వి ఉండకపోతే భూసేకరణకు ఇప్పుడు వేల కోట్ల రూపాయల భారం పడి ఉండేదన్నారు. పోలవరం కాల్వలపై ఆరోపణలు చేసిన టీడీపీ సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పోలవరం కాల్వ మీద పట్టిసమీ కట్టి రూ. 350 కోట్లు కొట్టేశారన్నారు. పోలవరం నిర్వాసితులను పట్టించుకోకుండా ఎంత సేపు కాంట్రాక్టులు, ముడుపులపైనే గత చంద్రబాబు సర్కార్‌ దృష్టిపెట్టిందన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వాసితుల స్థితిగతులు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబు కట్టించిన స్పిల్‌వే చూపించడానికి బస్సుల్లో ప్రజలను తరలించి వందల కోట్లు దోచేశారన్నారు. రామ భజన చేసినట్లుగా పోలవరం వద్ద బాబు భజన చేయించారన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. దుర్మాగాల చేత పోలవరం ప్రాజెక్టు ఓపెన్‌ చేయించడానికి ఆ భగవంతుడికి కూడా ఇష్టం ఉండదన్నారు.

తాజా వీడియోలు

Back to Top