పెన్నాన‌దిపై రెండు లైన్ల వంతెన‌కు ప్ర‌తిపాద‌న‌లు

కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపిన మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్‌
 

నెల్లూరు:  పెన్నా న‌దిపై రెండు లైన్ల వంతెన నిర్మించాల‌ని కోరుతూ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించారు. బ్రిడ్జి నిర్మాణం, పున‌రావాసం క‌లిపి రూ.100 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. ప్ర‌స్తుతం వంతెన 71 ఏళ్ల క్రితం కావ‌డంతో నిత్యం మ‌ర‌మ్మ‌తులు చేయాల్సి వ‌స్తుంద‌ని మంత్రి త‌న ప్ర‌తిపాద‌న‌లో పేర్కొన్నారు. పురాత‌న వంతెన‌పై నెల్లూరు వాసుల‌కు నిత్యం ట్రాఫిక్స్ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయ‌ని, బ్రిడ్జి మ‌ర‌మ్మ‌తులు మిన‌హా.. బ్రిడ్జి నిర్మాణంపై టీడీపీ ప్ర‌భుత్వం, అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌లేద‌ని మంత్రి అనిల్ మండిప‌డ్డారు. కొత్త వంతెన పూర్తయితే ట్రాఫిక్ క‌ష్టాలు తీరుతాయ‌ని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top