చంద్ర‌బాబూ.. నోరు అదుపులో పెట్టుకో

చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు వార్నింగ్‌

వలంటీర్ల వ్యవస్థపై ఎందుకంత కక్ష?

వలంటీర్లు సేవాభావంతో పని చేస్తున్నారు

వాస్తవ దోపిడీదార్లు ఆ పత్రికలు, ఆ మీడియానే

గత ప్రభుత్వం వల్లనే పోలవరం పనుల్లో జాప్యం

వారి అవినీతి, పొరపాట్ల వల్లనే ఇప్పుడు సమస్యలు

దమ్ముంటే నా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి

రాష్ట్రంలో రక్తబీజ రాక్షసుడు చంద్రబాబునాయుడే

రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ ఒక పెద్ద జోకర్‌

తాడేపల్లి: రాష్ట్రంలో వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైయ‌స్ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టార‌ని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, సామాన్యుడికి కూడా పరిపాలన అందుబాటులో ఉండే విధంగా, ప్రతి చోటా పూర్తి పారదర్శకత ఉండే విధంగా సీఎం అనేక మార్పులు చేస్తున్నారని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. సీఎం ఆలోచన విధానం మేరకు వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.  వాటిని ఇతర రాష్ట్రాల వారు కూడా గుర్తించార‌ని, ఇక్కడికి వచ్చి చూసి వారి రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా మొదలు పెడుతున్నారని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంటే ఓర్వ‌లేని చంద్ర‌బాబు, ఎల్లో మీడియా ప్ర‌భుత్వంపై నిత్యం విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..
అయితే దీన్ని సహించలేని కొందరు.. ముఖ్యంగా విపక్షంలో ఉన్న వారు తమ అనుకూల ఎల్లో మీడియాలో రకరకాల వార్తలు రాయిస్తున్నారు. అలా వలంటీర్‌ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ గజిట్‌ పత్రికలో రాశారు. వలంటీర్‌ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్తగా వైయ‌స్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌. అన్ని ప్రభుత్వ పథకాలు ఇంటి గడప వద్దే అందించడం కోసం రాష్ట్రంలో దాదాపు 2.70 లక్షల వలంటీర్లు పని చేస్తున్నారు. వారు తమకు కేటాయించిన ఇళ్లలోని వారికి తలలో నాలుకల మాదిరిగా పని చేస్తున్నారు. అలాంటి వలంటీర్లపై టీడీపీ గజిట్‌ పత్రిక విషం చిమ్ముతూ.. ఇష్టానుసారం రాశారు. 

ఇంత దారుణమా!..
రాష్ట్రంలో నేరాలు ఘోరాలు చేస్తున్నదంతా వలంటీర్లే. వారు హత్యలు, అత్యాచారాల వంటి ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాశారు. వలంటీర్ల వ్యవస్థపై మీకు కోపం ఉండొచ్చు. కానీ ఈ వ్యవస్థ వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. వలంటీర్లపై ప్రజల్లో ఉన్న భావాన్ని చెడగొట్టడం కోసం ఈ వ్యవస్థ మీద విషం కక్కుతున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకా ఏం కావాలి? మీ చేతిలో పత్రిక ఉంది. ఏం రాసినా జనం నమ్ముతారు. చంద్రబాబుకు ఓటేస్తారు అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కాలం చెల్లిన మాట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏ స్థాయిలో దోపిడి చేశాయో, ప్రజలను వేధించాయో అందరికీ తెలుసు. ఆ విషయాలను ఆనాడు ఈ పత్రికే రాసింది.

అప్పటికీ ఇప్పటికీ తేడా
నిజానికి ఇప్పుడు వలంటీర్లు ఎంతో గొప్ప సేవలందిస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికే వచ్చి, పెన్షన్‌ ఇస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. అదే విధంగా ప్రతి ప్రభుత్వ పథకం వలంటీర్ల ద్వారా అందుతోందని అంటున్నారు. అలాంటి వలంటీర్ల వ్యవస్థ మీద ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ఆనాడు జన్మభూమి కమిటీలు ప్రతి పనికి ఒక రేటు పెట్టి దోపిడి చేశాయి. అందుకే ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఇవాళ సామాన్యుడికి కూడా ఇంటి గడప వద్దనే ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. సచివాలయాల్లో అన్ని సేవలు అందుతున్నాయి. వారు ఏ పనికీ ఏ కార్యాలయానికి, ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్లు 39 లక్షలు మాత్రమే. అదే వైయ‌స్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ఇస్తున్న పెన్షన్లు దాదాపు 63 లక్షలు. ప్రతి నెలా వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం కచ్చితంగా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్‌ అందిస్తోంది. అలాంటి వలంటీర్ల మీద ఈనాడు పత్రిక విషం చిమ్ముతోంది. 

దోపిడీదార్లు ఆ పత్రికలే
గ్రామాల్లోనే ఉండి పని చేస్తున్న వలంటీర్లకు నెలకు రూ.5 వేలు ఇస్తున్నాం. వారు ఎన్నో వి«ధాలుగా సేవలందిస్తుంటే, వారిని నేరస్తులుగా, హంతకులుగా, మోసగాళ్లుగా చూపే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది. నిజానికి వారు దోపిడిదారుల తప్ప, వలంటీర్లు కాదు.

పొంతన లేని బాబు మాటలు..
చంద్రబాబు ఇటీవల రోడ్‌షోలు నిర్వహించి, బహిరంగ సభలు పెట్టి.. ఇదేమి ఖర్మ అన్న నినాదంతో వెళ్తున్నారు. దాన్ని చూసి జనం ‘ఇదేమి ఖర్మ చంద్రబాబుకు’ అనుకుంటున్నారు.కొని తెచ్చి పెట్టుకున్న మాటలు, ఆవేశం, నవ్వు.. ఇది చంద్రబాబు వ్యవహారశైలి. మీరు ఓటు వేయకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలు అని నోరుజారిన చంద్రబాబు మనసులో మాట బయటపెట్టాడు. దాన్ని సరి చేసుకోవడానికి ఇవాళ మాట మార్చారు. ఈసారి తనకు ఓటేయకపోతే, రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని చెబుతున్నాడు. దీనికి ఏమైనా అర్ధం ఉందా? చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వు వస్తుంది. తనకు సీఎం పదవి అవసరం లేదని, ప్రజల కోసమే వస్తానని చెబుతున్నాడు. మరోవైపు అసెంబ్లీలో ఏమన్నాడు? మళ్లీ గెల్చి సీఎం అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. రెండింటికీ ఎక్కడైనా పొంతన ఉందా?

ఆ ముగ్గురే సైకోలు..
మళ్లీ అధికారం కోసం చంద్రబాబు అర్రులు చాస్తున్నాడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. వైయ‌స్‌ జగన్‌ని సైకో అంటున్నాడు. నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, దత్తపుత్రుడు ముగ్గురూ సైకోలు. 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెల్చిన వీరుడిని పట్టుకుని సైకో అని పిచ్చి విమర్శలు చేస్తున్నాడు.

పనుల్లో జాప్యానికి మీరే కారణం
ఇంకా ఎక్కడ మాట్లాడినా పోలవరం ప్రాజెక్టును ప్రస్తావిస్తున్నాడు. మా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని, ప్రాజెక్టును గోదావరిలో మంచేసిందని విమర్శిస్తున్నాడు. కానీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులు. పొరపాట్లే కారణం. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారు. దాంతో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ఇలా ప్రపంచంలో ఎవరూ చేయరు. ఇది వాస్తవం. అయినా సరే, చంద్రబాబు మాత్రం పదే పదే అసత్యాలు చెబుతున్నారు. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 

దమ్ముంటే సమాధానం చెప్పండి
నేను 3 ప్రశ్నలు వేశాను. కానీ ఇప్పటికీ వాటికి సమాధానం చెప్పలేదు. మరోసారి అడుగుతున్నాను. ఇప్పుడైనా జనం ముందు వాటికి సమాధానం చెప్పు.
1. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే స్వయంగా కడతానంటే, మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు రాజీ పడ్డారు? కారణం ఏమిటి? కేవలం కమిషన్ల కోసం కాదా?
2. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఎందుకు చేయలేకపోయారు?
3. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు నిర్మించారు?
దమ్ము, ధైర్యం ఉంటే వీటికి సమాధానం చెప్పండి.

నీ రాజకీయ జీవితం ఏమిటి?
కానీ అవి చెప్పకుండా మాపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. కిలాడీ రోశయ్య, ఆంబోతు రాంబాబు.. అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నన్ను గంట, అర గంట మంత్రి అంటూ వ్యాఖ్యానిస్తున్నాడు. కనీసం సభ్యత, సంస్కారం లేదు.

ఆంబోతులకు ఆవులు సరఫరా చేయలేదా?
చంద్రబాబూ.. నీ రాజకీయ జీవితం ఏమిటి? ఆంబోతులకు ఆవులను సరఫరా చేయలేదా? అలాంటి వారిని ఏమంటారో నా నోటితో చెప్పించొద్దు. అలాంటి సన్నాసివి నీవు. నా గురించి మాట్లాడుతావా?.
మళ్లీ నోరు జారొద్దు. అలా జారితే నేను నోరు తెరుస్తాను. జాగ్రత్త. నీకు ధైర్యం ఉంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు ఎన్ని పర్యటనలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నిన్ను నమ్మబోరు. నీకు మళ్లీ అధికారం రావడం కల్ల. ఎందుకంటే వైయ‌స్‌ జగన్‌ సుపరిపాలన అందరూ గుర్తించారు. అందుకే ఎందరు కలిసినా, ఎన్ని చేసినా, మళ్లీ ఆయనే సీఎం. 175కు 175 సీట్లు గెలుస్తారు.

ఏమిటీ చీప్‌ మాటలు!
తన వల్లే ఐటీ వచ్చిందని, పిల్లలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి, రాయల్టీ కట్టాలని అంటున్నారు. ఆయన వల్లే రాష్ట్రంలో ఐటీ వచ్చిందా? దేశంలో ఎక్కడా ఐటీ రంగం అభివృద్ధి చెందలేదా?
వారు రాయల్టీ కట్టాలా? ఏమిటా చీప్‌ మాటలు. 2014 ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. రైతుల రుణమాఫీ చేయలేదు. ఏ మాట నిలబెట్టుకోలేదు. అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారు.

అంత ఆర్భాటం అవసరమా?
పవన్‌కళ్యాణ్‌ గురించి ఎందుకంత మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ప్రతి ఎన్నికల్లో ప్రజా నాయకులు తిరగడానికి వాహనాలు ఉంటాయి. ఏడాదిన్నర ముందు ఏదో ఒక వాహనం రూపొందించుకుని, దానికి ఏ దేవత పేరో పెట్టి.. ఇప్పటి నుంచే పబ్లిసిటీ పొందాలని పవన్‌ అనుకుంటున్నారు. వాహనంపై అంత ఆర్భాటం అవసరమా?

రక్తబీజ రాక్షసుడు చంద్రబాబే
రాష్ట్రంలో రక్త బీజుడు అయిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే, చంద్రబాబు మాత్రమే. మరి ఆయనను చంపడానికి వెళ్తాడో.. లేకపోతే రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్న వైయ‌స్‌ జగన్‌ మీదకు వెళ్తావో తేల్చుకోవాలి. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్‌కళ్యాణ్‌.. సినిమాల్లో హీరో మాత్రమే. రాజకీయాల్లో పెద్ద జోకర్‌. ఒక విచిత్ర వేషధారుడు. పిచ్చి పిచ్చి మాటలు. పనికిమాలిన పనులు చేస్తున్నాడు.

Back to Top