పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పనులే శాపం

 
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 

ఆయన వల్లనే ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతున్నాయి

డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణం

కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయకపోవడం వల్లనే అది జరిగింది

రెండు చోట్ల గండ్లు పెట్టి, కాఫర్‌ డ్యామ్‌ పనులు చేశారు

దీంతో ఫోర్స్‌తో నీరు రావడంతో డయాఫ్రమ్‌ వాల్‌ పోయింది

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

దీనిపై మేము చర్చకు సిద్ధం. చంద్రబాబుకు ధైర్యం ఉందా?

చర్చకు సిద్ధమైతే చంద్రబాబు శాసనసభకు రావాలి

అక్కడ అన్నీ చర్చిద్దాం. అందుకు మేము రెడీగా ఉన్నాం

నీవు సభకు రాకపోతే, మీ ఇంటికి రమ్మన్నా వస్తాను

జలవనరుల శాఖ మంత్రిగా వస్తా. అన్నీ చర్చిద్దాం

అందుకైనా నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ ధైర్యం ఉందా?

చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడం కోసమే రివర్స్‌ టెండరింగ్‌

అందులో భాగంగానే కాంట్రాక్ట్‌ పనులు కొత్త సంస్థకు ఇచ్చాం

మరి ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ నుంచి పనులు ఎందుకు తప్పించారు?
 

ఆ పనులను ఆనాడు మీరు నవయుగకు ఎందుకు ఇచ్చారు?

ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

తాడేపల్లి: చంద్రబాబు చేసిన తప్పిదం వల్లనే డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింద‌ని, పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు పనులే శాపమని మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. ఇప్పటికీ దానికి ఏం చేయాలన్న దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నామ‌ని తెలిపారు. తాజాగా ఎన్‌హెచ్‌పీసీ వాళ్లు అధ్యయనం చేస్తున్నారు. వారు నివేదిక ఇవ్వాలి. అది పీపీఏకు పోవాలి. ఇన్ని చేసిన చంద్రబాబు ఏదో లేఖ రాసి, మా మీద మసి పూసే ప్రయత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణం. డయాఫ్రమ్‌ వాల్‌ కూడా వారి నిర్వాకం వల్లనే కొట్టుకుపోయింది. దీనిపై మేము చర్చకు సిద్ధం. ధైర్యం ఉంటే రండి అంటూ అంబ‌టి రాంబాబు స‌వాలు విసిరారు.

 చంద్రబాబు అనైతిక ఆరోపణలు:
    మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత చంద్రబాబు ఒక సుదీర్ఘ లేఖను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి అస్సలు పట్టించుకోరు. చెత్తబుట్టలో వేస్తారు. అయినా దాన్ని ఎల్లో మీడియా హైలైట్‌ చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. నిజానికి డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు చేసిన తప్పిదం మాత్రమే. 

దురుద్దేశంతోనే లేఖ:
    అసలు పోలవరం పనులను తొలుత చేపట్టింది ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ కాగా, వారిని మార్చి నవయుగ కంపెనీకి అప్పగించింది చంద్రబాబు. వ్యయాన్ని తగ్గించడం కోసం ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో పనులను మెగాకు అప్పగించడం జరిగింది. ఆరోజు ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ నుంచి పనులు తప్పించడాన్ని పీపీఏ ఆమోదించగా, ఇవాళ మెగాకు అప్పగిస్తే ఎందుకు ఒప్పుకోదు?.
    ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో రాసిన లేఖ తప్ప, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని రాసింది కాదు. దీన్ని కేంద్ర మంత్రి చూడనే చూడరు. అయినా ఈనాడులో మాత్రం పేజ్‌–1 లో పెద్ద వార్త వేశారు.
ఆ విధంగా ప్రజల్లో దురభిప్రాయం కల్పించే ప్రయత్నం. అసలు పోలవరం పనులను జాప్యం చేయాలని మేము ఎందుకు అనుకుంటాం?.

ఆనాడు మీరెందుకు పూర్తి చేయలేదు?:
    మీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో 71 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి, కుడి కాల్వ నుంచి నీరిస్తాం అన్నారు. దాన్ని శాసనసభలో సవాల్‌ కూడా చేశారు. నిజానికి మీరు ప్రాజెక్టులో 71 శాతం అస్సలు పూర్తి చేయలేదు. ఏ పని కూడా సక్రమంగా పూర్తి చేయలేదు. స్పిల్‌వే కట్టలేదు. గేట్లు పెట్టలేదు. అవన్నీ మేము వచ్చాక పూర్తి చేశాం.
    డయాఫ్రమ్‌ వాల్‌ను దారుణంగా కట్టారు. అది దెబ్బ తినడానికి కారణం చంద్రబాబు అహం. అప్పటి మంత్రి దేవినేని ఆతృత. డబ్బులు కాజేయాలన్న ఆశ తప్ప, మరొకటి కాదు.

డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు పోయింది?:
    డయాఫ్రమ్‌ వాల్‌ను, చుట్టూ ఉన్న కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేయకుండా కట్టారు. కనీసం కాఫర్‌ డ్యామ్‌ను కట్టకుండా వదిలేసినా, నీరు నేరుగా వెళ్లిపోయేది. కానీ మధ్యలో రెండు చోట్ల కాఫర్‌ డ్యామ్‌ను వదిలేశారు. అక్కడ అవి ఎందుకు పూర్తి చేయలేదు అంటే.. అవి ఒకవేళ పూర్తి చేసి ఉంటే, 35 కాంటూరులో నీరు చేరుతుంది. దీంతో ఆ పరిధిలో ఉన్న గ్రామాలు మునిగిపోతాయి. దీన్ని గమనించి ఆయా గ్రామాల వారు వెంటనే పీపీఏ వద్ద మొర పెట్టుకోగా, వెంటనే వారిని ఖాళీ చేయించమని చెబితే, ఆ పని చేయలేదు. కానీ డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేసి, కాఫర్‌ డ్యామ్‌కు రెండు చోట్ల గండ్లు పెట్టారు. దీంతో నీరు నాజిల్‌ ఫోర్స్‌తో వేగంగా ప్రవహించి డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయింది.
    అసలు కాఫర్‌ డ్యామ్‌ కట్టకపోయి ఉన్నా, అది కొట్టుకుపోయేది కాదు.ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు. అయినా సీఎంగారిపై నింద వేస్తున్నారు. ప్రభుత్వంపై బుదర చల్లుతున్నారు.

ఏం చేయాలన్నది అర్ధం కావడం లేదు:
    అసలు డయాఫ్రమ్‌ వాల్‌ అనేది ఇప్పటికి కూడా ఎంత మేర దెబ్బ తిన్నది అన్నది అర్ధం కావడం లేదు. ఎందుకంటే అది భూగర్భంలో 100 మీటర్ల లోతులో ఉంటుంది. దాన్ని ఎక్కడెక్కడి నుంచో నిపుణులు వచ్చి చూస్తున్నారు. అయినా దాని గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. 
అయినా ప్రభుత్వాన్ని నిందిస్తున్న చంద్రబాబు, డయాఫ్రమ్‌ వాల్‌ ఎప్పుడు, ఎలా కూలిపోయిందో కూడా ప్రభుత్వం గుర్తించలేకపోతోందని విమర్శిస్తున్నారు. 

చర్చకు సిద్ధం. మీలో ధైర్యం ఉందా?:
    చంద్రబాబుకు మేము సవాల్‌ చేస్తున్నాం. చర్చకు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా రెండు చోట్ల గండ్లు పెట్టడం వల్ల, నాజిల్‌ ఎఫెక్ట్‌తో నీరు ప్రవహించి, డయాఫ్రమ్‌ వాల్‌ పోయింది. ఇప్పటికైనా మీకు ధైర్యం ఉంటే సభకు రండి. అక్కడే పోలవరం ప్రాజెక్టుపై చర్చిద్దాం. డయాఫ్రమ్‌ వాల్‌ ఎందుకు కొట్టుకుపోయిందో చర్చిద్దాం. మీరు సభకు రాకపోతే.. నన్ను మీ ఇంటికి రమ్మన్నా జల వనరుల శాఖ మంత్రిగా నేను అందుకు సిద్ధంగా ఉన్నాను.
    ఒక ప్రణాళిక లేకుండా అన్ని పనులు ఒకేసారి మొదలు పెట్టారు. ఒకవైపు స్పిల్‌వే పూర్తి చేయలేదు. మరోవైపు డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు. 35 కాంటూరు వైపు ఉన్న ఊళ్లు ఖాళీ చేయించలేదు. దీంతో కాఫర్‌ డ్యామ్‌ అరకొరగా పూర్తి చేశారు. ఆ విధంగా అన్ని తప్పులు చేసిన మీరు. ఇప్పుడు ధైర్యం ఉంటే చర్చకు రండి. సభలో చర్చిద్దాం.
    ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ చాలా కీలకం. దానికి రూ.400 కోట్లు ఖర్చు అయింది. దాన్ని మళ్లీ కట్టాలంటే ఇవాళ రూ.600 కోట్లు కావాలి. ఇది నూటికి నూరు శాతం తెలుగుదేశం పాపం. అందుకు ఏ చర్చకైనా మేము సిద్ధం.

బురద చల్లే కుట్ర:
    ఇన్ని చేసి అన్నీ తెలిసిన చంద్రబాబు ఇలా లేఖ రాయడం. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పెద్దగా రాయడం. ఆ విధంగా  

 
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు:
    చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే ఆయన ఉద్దేశం. ఆయన సభలో స్వయంగా చెప్పారు. 2018లో పనులు పూర్తి చేసి, నీళ్లిస్తామన్నాడు. మరి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పూర్తి చేసే వారు కదా?
    వాస్తవానికి పనులు చేయకుండానే విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. బస్సులు వేసి మరీ ప్రజలను తరలించి చూపాడు. వారితో భజనలు చేయించుకున్నాడు.
    నిజం చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టుపై మాకు చిత్తశుద్ధి ఉంది. దాన్ని మానేత వైయస్సార్‌ ప్రారంభించారు. వ్యయం తగ్గించడానికి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాం. ఆ విధంగా కొత్త కాంట్రాక్టర్‌కు ఇచ్చాం. ప్రతి పని చిత్తశుద్దితో చేస్తున్నాం.
    మళ్లీ చెబుతున్నా. డయాఫ్రమ్‌ వాల్‌ పోవడానికి కారణం చంద్రబాబు. ఆ పాపం ఆయనదే. అన్ని తప్పులు చేశాడు కాబట్టే, ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. మరోసారి కూడా చెబుతారు

Back to Top