కాపులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ పెద్దపీట  

మంత్రి అంబ‌టి రాంబాబు
 

రాజ‌మండ్రి:  కాపులకు సీఎం వైయ‌స్ జగన్‌ పెద్ద పీట వేశార‌ని మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు.  చంద్ర‌బాబు గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  ఇటీవల కాపు ఎమ్మెల్యేలను పవన్‌ దూషించడాన్ని ఖండిస్తున్నామ‌ని తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి దిగజారి మాట్లాడతారా?, రంగా మరణానికి పవన్‌ కల్యాణ్‌ కొత్త భాష్యం చెప్పారు. రంగా హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్‌ జట్టు కట్టారు. టీడీపీ హయాంలో కాపులను వేధిస్తే.. సీఎం వైయ‌స్‌ జగన్‌  అన్ని రకాలుగా అండగా నిలిచారు. పవన్‌ ముసుగు తొలగింది. కాపు సోదరులు ఆ విషయం గుర్తించాల‌ని మంత్రి అంబటి రాంబాబు కోరారు. ఒక్క కలం పోటుతో సీఎం వైయ‌స్ జగన్ కాపుల మీద కేసులు ఎత్తేశారని గుర్తు చేశారు. కాపులను ప్రేమతో చూసుకుంది వైయ‌స్ఆర్‌,  వైయ‌స్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. కాపుల శత్రువు చంద్రబాబు.  చంద్రబాబుకు కాపులను తాకట్టు పెట్టడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ సీఎం కావడం కోసం కాదు.. చంద్రబాబును సీఎం చేయడానికి జనసేన ప్రయత్నం చేస్తోంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు.

రంగ హ‌త్య‌కు చంద్ర‌బాబే కార‌ణం:  మంత్రి దాడిశెట్టి రాజా
వంగవీటి  రంగా హత్యకు చంద్రబాబే కారణమని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.  రంగా హత్యగురించి పవన్‌ కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకోవాల‌న్నారు.  ప్రాణహాని ఉందని వంగవీటి రంగా చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రంగాను చంద్రబాబే హత్య చేయించారని హరిరామజోగయ్య తన పుస్తకంలో రాశారు’ అని దాటిశెట్టి రాజా పేర్కొన్నారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కాపు శ్రేయోభిలాషి:  మాజీ క‌న్న‌బాబు
కాపు శ్రేయోభిలాషి సీఎం వైయ‌స్‌ జగన్ అని మాజీ మంత్రి క‌న్న‌బాబు అన్నారు. 2019 ఎన్నికల్లో కాపులు వైయ‌స్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి నిలబడ్డారన్నారు. టీడీపీకి 23 సీట్లు, జనసేనకు 5.44 శాతం ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి కాపులు ఎవరి వెనుక ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. కాపు ఉద్యమాన్ని  అణచి వేయడానికి  సెక్షన్ 30ని అమలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. విశాఖలో సెక్షన్ 30పై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని క‌న్న‌బాబు అన్నారు. రంగాను చంపించింది చంద్రబాబే అని హరిరామ జోగయ్య వీడియోను విలేకరుల ముందు ప్రదర్శించార‌ని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top