ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి

 ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి జనతా కర్ఫ్యూ

అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి

ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తాడేపల్లి:  కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి..మీ భాగస్వామ్యం కావాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజు అదనంగా 7 శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించాం. మొత్తం 142 అనుమానిత కేసుల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాం. ఇంకా 23 కేసుల నివేదికలు రావాల్సి ఉంది.  ఆదివారం అన్ని పెట్రోల్‌ బంకులు బంద్‌. ప్రభుత్వ చర్యలు విజయవంతం కావాలంటే ప్రజల సహకారం కావాలి. ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి జనతా కర్ఫ్యూ. రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలి.జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఆర్టీసీ సేవలు బంద్‌. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజలు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలపాలి. రాష్ట్రంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు.

Back to Top