ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు వాయిదా

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేర‌కు జూన్ 7న జరగాల్సిన టెన్త్‌ పరీక్షలను వాయిదా వేశామ‌ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షలపై కూడా సీఎంతో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామ‌ని, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సంప్రదింపులు చేస్తోంద‌ని చెప్పారు. జేఈఈ, నీట్‌ వంటి ఎంట్రెన్స్‌ టెస్టులకు మార్కులు అవసరం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top