వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోకేష్‌ తప్పుడు ప్రచారం

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

తాడేపల్లి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై లోకేష్‌  తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించేందుకు ఏ అంశమూ దొరక్క విద్యా వ్యవస్థను రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని వివరించారు. ఏపీలో ఇప్పటి వరకు 7 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశామన్నారు. 4 కోట్ల మందికి తొలి డోస్‌. 3 కోట్ల మందికి రెండో డోసు వేశామని చెప్పారు. పాఠశాలల్లో టీచర్లందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. 15 ఏళ్లు దాటిన పిల్లలకు 95 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యిందన్నారు. 
 

Back to Top