పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మ ఒడి

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

తాడేపల్లి:  పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మ ఒడి పథకం అందజేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.  పారిశుద్ధ్య కార్మికులకు అమ్మ ఒడి లేదంటూ పచ్చ పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమ్మ ఒడిలో మార్పులు, చేర్పులకు జనవరి 5వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీ అమ్మ ఒడి అర్హుల జాబితా ్రçపదర్శిస్తామన్నారు. 9వ తేదీ అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. సడలించిన నిబంధనలతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరగనుందని తెలిపారు.గతేడాది అమ్మ ఒడి అందిన అందరూ రెండో విడతకు అర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని వెల్లడించారు.

Back to Top