ట్రిపుల్‌ ఐటీల స్ఫూర్తి దివంగత వైయస్‌ఆర్‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

శ్రీకాకుళం: ట్రిపుల్‌ ఐటీల స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఎస్‌ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో డిజిటల్‌ క్లాస్‌లు, హాస్టల్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ఐదేళ్లలో ట్రిపుల్‌ ఐటీలు నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. ట్రిపుల్‌ ఐటీలను దేశంలోనే అత్యున్నత సంస్థలుగా రూపుదిద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఒక అడుగు ముందుకు వేశారన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయానికి సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాకుడదని వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మహానేత ఆశయానికి అనుగుణంగా వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకాన్నిప్రవేశపెట్టారన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top