త్వ‌ర‌లోనే ఎంసెట్ కౌన్సిలింగ్‌

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 
 

 అమరావతి : త‌్వ‌ర‌లోనే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పించడం పట్ల రాజీపడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. లాభాల వ్యాపారంగా నడుస్తున్న విద్యావ్యవస్థకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.  టీచర్ల నియామకంలోని సమస్యలను సమీక్షించామని, వాటిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 2018 డీఎస్సీ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన తర్వాత నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపడతామన్నారు. ఫీజుల నియంత్రణపై రూపొందించిన చట్టానికి కేబినెట్‌ ఆమోదం లభించిందన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై సీఎం వైయ‌స్‌ జగన్‌ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top