సభలో ప్రతిపక్ష సభ్యుల తీరు సిగ్గుచేటు

చారిత్రక బిల్లును ప్రతిపక్షం అడ్డుకుంటోంది..

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

అమ‌రావ‌తిః సభలో ప్రతిపక్ష సభ్యుల తీరు సిగ్గుచేటని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడుతూ చారిత్రక బిల్లులను ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు.మన రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఉందని రాష్ట్రంలో పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించడం లక్షలాది మంది యువతకు మేలు చేసే విధంగా ముందుకెళ్తురన్నారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు కేటాయిస్తూ ప్రతిపాదించిన బిల్లును ప్రతిపక్షం అడ్డుకోవడం దారుణమన్నారు.ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తారని పేర్కొన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే సంక్పలంగా ముందుకు వెళ్తున్నారని, పేదలు,రైతులు,యువత గుండెల్లో వైయస్‌ జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top