స్టార్టప్‌‌లకు ఏపీ చిరునామా

హెచ్‌సీఎల్‌ చైర్‌పర్సన్‌ రోష్నితో మేకపాటి వీడియో కాన్ఫరెన్స్‌

ఐటీ హబ్‌, స్కిల్‌ యూనివర్శిటీలో తోడ్పాటునందిచాలని విజ్ఞప్తి

అమరావతి: ‘స్వగ్రామం నుంచే సాఫ్ట్‌వేర్’ విధులు నిర్వర్తించే వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టనున్నట్లు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్‌‌లకు ఏపీ చిరునామాగా మారనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ప్రఖ్యాత ఐటీ కంపెనీ 'హెచ్సీఎల్ టెక్నాలజీస్' చైర్‌పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రాతో మంత్రి మేకపాటి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగనన్‌మోహన్‌రెడ్డి ఆలోచన ప్రకారం విశాఖపట్నంలో అత్యున్నత స్థాయి నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు  మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఐటీ వృద్ధితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తరహా అత్యాధునిక కోర్సులకు చిరునామాగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్శిటీలో తోడ్పాటునందించాలని మంత్రి కోరడంతో హెచ్ల్‌సీఎల్‌‌ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top