మేక‌పాటి గౌతంరెడ్డి కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు: నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు కూడలి లో దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్క‌రించారు. గౌతంరెడ్డి 52వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈనాటి రాజకీయాల్లో మేలిమి ముత్యం.. మేకపాటి గౌతం రెడ్డి అని కొనియాడారు.  రాజకీయాల్లోనే కాకుండా ప్రజా క్షేత్రంలోనూ తనదైన ముద్ర వేసుకున్న గౌతం రెడ్డి గుండెపోటుతో అకాల మ‌ర‌ణం చెందడం జీర్ణించుకోలేకపోతున్నామ‌న్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేతో ఒకసారి మంత్రిగా పనిచేసిన ఆయన.. నూతన పరిశ్రమల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేశార‌ని గుర్తు చేశారు. 

కార్య‌క్ర‌మంలో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌ప‌ర్స‌న్ ఆనం అరుణమ్మ, మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మానుగుంట మహీధర  రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, నగర కమిషనర్ వికాస్ మర్మత్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Back to Top