కోవిడ్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

మంగళగిరి: కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌పై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ ప్రారంభమైంది. మంళగగిరిలోని ఏపీఐసీ బిల్డింగ్‌లోని 6వ బ్లాక్‌లో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, సీదిరి అప్పలరాజు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్, వ్యాక్సినేషన్‌ వంటి పలు  అంశాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చర్చిస్తోంది. 
 

తాజా వీడియోలు

Back to Top