కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత‌ పేరుపెట్ట‌డం హ‌ర్ష‌ణీయం

ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో ర్యాలీ

విజ‌య‌వాడ‌: కోన‌సీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేయ‌డాన్ని హ‌ర్షిస్తూ వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పాల్గొన్నారు. తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద గ‌ల డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. కోన‌సీమ జిల్లాను బీఆర్ అంబేడ్క‌ర్ జిల్లాగా నామ‌క‌ర‌ణం చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ విజ‌య‌వాడ‌ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top