విశాఖలతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నాం

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో హైకోర్టుకు వచ్చాం

ప్రజల ఆకాంక్షలను ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం

అమ‌రావ‌తి: విశాఖలతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నామని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ పేర్కొన్నారు. అమరావతి మహా పాదయాత్ర రద్దు చేయాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్ర రద్దు పిటిషన్ తో పాటు దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు మధ్యాహ్నం వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి మంత్రి సీనియర్ కౌన్సిల్ తో హైకోర్టుకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రైతుల రిట్ పిటిషన్ పై న్యాయస్ధానం ఇచ్చిన అర్డర్ అనుసరించాల్సి ఉందన్నారు.. 17 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పిటిషన్ లో పొందుపరిచారు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలపడానికి సీనియర్ కౌన్సిల్ తో వచ్చామని.. రేపు మధ్యాహ్నం న్యాయస్ధానం వాదనలు వింటామన్నదని తెలిపారు.. ప్రజల ఆకాంక్షలను, ప్రజా ప్రతినిధులుగా మేం చెప్పకుండా ఎలా ఉంటాం? అని ప్రశ్నించారు.  ప్రజల ఆలోచనా విధానం మేం చెప్పడానికి వచ్చాం.. మేం కూడా అవసరం అయితే ఇంప్లీడ్ అవుతామని మా ప్రాంత నాయకులు వచ్చారని తెలిపారు. 

 పాదయాత్ర విరామ సమయంలో 25 మంది దగ్గర కూడా ఐడీ కార్డులు లేవన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను బైపాస్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు మేం సమాధానం చెప్పాలి.. ప్రజా ప్రతినిధులుగా మా చేతనైన కంట్రోల్ మేం చేస్తున్నాం.. విశాఖతో పాటు అమరావతి కూడా బాగుండాలని మేం కోరుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. రెచ్చగొట్టేలా ఏ పని చేయద్దని మేం అంటున్నాం.. కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఇదే సమయంలో.. వికేంద్రీకరణకు మద్దతు తెలిపి.. అమరావతి బాగుండాలి అంటే కాలు కింద పెట్టనీయకుండా పాదయాత్ర చేస్తున్నవారిని అరసవిల్లి వరకు తీసుకెళ్తామని మంత్రి వ్యాఖ్యానించారు.

Back to Top