పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు

నాలుగువేలకు పైగా ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయారు 

విశాఖ కలెక్టర్‌ బాధ్యతారాహిత్యం 

వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు

విశాఖపట్నం: పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు జరిగాయని వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు మండిప‌డ్డారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌ బాధ్యతా రాహిత్యం బయటపడిందని మండిపడ్డారు. ఎన్నికల అధికారి చెప్పినట్లు జిల్లా కలెక్టర్‌ వ్యవహరించడం లేదని ధ్వజమెత్తారు. 4 వేలకు పైగా ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోయారని తెలిపారు. ఇదే తీరు కొనసాగితే కౌంటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని కలెక్టర్‌కు తెలిపామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి సమాచారాన్ని కోరినట్లు తెలిపారు.
పోస్టల్‌ బ్యాలెట్‌ అందరికీ అందేలా చర్యలు చేపట్టాలి:అవంతి 
భీమిలిలో పోస్టల్‌ బ్యాలెట్‌ అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ నేత  అవంతి శ్రీనివాస్‌ కోరారు.కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వాలన్నారు.ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించలేదని, సీఎంపై నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు.సీఎం చంద్రబాబు మాదిరిగానే విశాఖ జిల్లా కలెక్టర్‌ వ్యవహరిస్తున్నారన్నారు.ఏప్రిల్‌ 7న పోస్టల్‌ బ్యాలెట్‌ నిలిపేసి 10న విధులు అలాట్‌ చేశారన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top