తాడేపల్లితో కలిసి మహానగరిగా మంగళగిరి

అమరావతిలో భాగంగా ఉన్నా గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధికీ నోచుకోకుండా ఉండిపోయాయిన తాడేపల్లి, మంగళగిరి మండలాలు కలిపి మెగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాల్లో రియలెస్టేటు వృద్ధి చెందిందే తప్ప ఆ ప్రాంతాలకు మేలు జరగలేదు. అపార్టుమెంట్ కల్చర్ పెరగడం తప్పించి రోడ్లు, డ్రైయినేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఈ రెండు మున్సిపాలిటీలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలను రెంటినీ కలిపి అభివృద్ధి  చేసేందుకు 1,500 కోట్ల రూపాయిలు కేటాయిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే ఈ విషయంపై ప్రకటన కూడా ఇచ్చారు. ఈ రెండు మండలాల్లోని గ్రామాలన్నిటినీ అనుసంధానిస్తూ అభివృద్ధిపరిచేలా సీఆర్‌డిఎ ఇందుకు అవసరమైన ప్లానింగ్ ను సిద్ధం చేస్తోంది.

తొలుత బకింగ్ హాం కెనాల్ గట్టున ఉన్నఅక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తారు. అక్కడ నివాసం ఉంటున్న వారికి కొత్త చోట నివాసం ఏర్పాటు చేసిన తర్వాతే అధికారిక తొలగింపులు ఉంటాయని కూడా ఎమ్మెల్యే స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలో 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం సిఆర్‌డిఎ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వరకూ నిర్మించే ఈ రోడ్డుతో పాటు, తాడేపల్లి రేవేంద్రపాడు మధ్యలో బకింగ్ హాం కాలువపై 4 వంతనెల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. కుంచనపల్లి పంపింగ్ స్కీమ్ నుండి చిర్రావూరు వరకూ మరో ముఖ్యమైన రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంచనపల్లి, పాతూరు, గుండిమీద, వడ్డేశ్వరం, ఇప్పటం గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

మరిన్ని అభివృద్ధి ప్రణాళికలు

  • కృష్ణా నది నుంచి రా వాటర్ తీసుకుని ఫిల్టర్ చేయించి గ్రావిటీ ద్వారా ఈ రెండు మున్సిపాలిటీలకు అందించడం
  • రెండు ప్రాంతాలకు కలిపి డంపింగ్ యార్డు ఒకే చోట ఏర్పాటు చేయడం
  • విజయవాడ తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి
  • వర్షపాతం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు
  • ఉమ్మడి ప్రణాలిక ద్వారా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను మెగా మున్సిపాలిటీగా అభివృద్ధి పరచడం

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top