హిందూ ధర్మం నాలుగు పాదాల మీద ఉండేలా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన  

 బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు

పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ధన్యవాదాలు

అమరావతి : రాష్ట్రంలో హిందూ ధర్మం నాలుగు పాదాల మీద ఉండేలా సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పాలన సాగిస్తున్నార‌ని  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పవిత్ర తుంగభద్ర పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని ఆయ‌న‌ తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి, గుమ్మ‌నూరు జయరాం, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో సైతం కేంద్రం సూచించిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలు నిర్వహించారని అన్నారు. తుంగభద్ర పుష్కరాలలో 3 లక్షల 90 వేల మంది భక్తులు పాల్గొని జల్లు స్నానాలు ఆచరించారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధవంతంగా పుష్కరాలను నిర్వహించిందని అన్నారు. ‘‘ ఛాతుర్ మాస దీక్ష అని హైదరాబాద్‌లో కూర్చున్న పవన్ కల్యాణ్‌కు పుష్కరాలలో పాల్గొనే తీరిక లేదు. కేవలం సినిమాలో మాదిరిగా షో  చేసేందుకే పవన్ ఉన్నారు.  

అధికారంలో ఉంటే ప్రజలను చంపటానికేనా పుష్కరాలు?.. చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి.  పుష్కరాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల తీరును ప్రజలు గమనించాలి. అన్ని  ప్రభుత్వ శాఖల సమన్వయంతో.. ముఖ్యమంత్రి సూచనలతో  విజయవంతంగా పుష్కరాలు ముగిశాయి. పుష్కరాలను పొలిటికల్‌గా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. పుష్కరాలలో పాల్గొనని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల నైజాన్ని ప్రజలు గమనించాలని మ‌ల్లాది విష్ణు అన్నారు.

Back to Top