తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించిన సామాజిక సాధికారతను సీఎం వైయస్ జగన్ సాధించి చూపించారని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రులు కారుమూరి, మేరుగు నాగార్జున, ఇతర ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ నడుస్తున్నారన్నారు. పూలే ఆశించిన సామాజిక సాధికారత సీఎం వైయస్ జగన్ సాధించారని చెప్పారు. బలహీనవర్గాల గుండె చప్పుడుగా సీఎం వైయస్ జగన్ మారారని, అట్టడుగు వర్గాలను ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారత దిశగా నడిపిస్తున్న సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అణగదొక్కాలని చూశారని మండిపడ్డారు.