విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయవంతం చేద్దామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జన్మదిన వేడుకల సన్మాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహిద్దామని కోరారు. డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరపబోయే వివిధ కార్యక్రమాల్లో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మమేకం అవ్వాలని కోరారు. ▪️ 19వ తేదీ: గ్రామ, మండల కేంద్రాల్లో వివిధ క్రీడా పోటీలను నిర్వహించాలని ఇందులో పెద్ద ఎత్తున మహిళలను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ▪️ 20వ తేదీ : మొక్కల నాటే కార్యక్రమం, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సుపరిపాలనపై చర్చ వేదికలు, డిబెట్ లు గ్రామ, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు ▪️ 21వ తేదీ : గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయబోయే రక్తదాన శిబిరాల్లో జిల్లాలో ప్రతి ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, ఇందులో భాగంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు, భవిష్యత్తులో అత్యవసర పరిస్దితులలో రక్తదానం చెయ్యడానికి సుముఖంగా ఉన్నవారిచే "TAKE THE PLEDGE SAVE A LIFE" అనే నినాదంతో ysrcpblooddonation.com వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించాలని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెల్లాన చంద్రశేఖర్ సూచించారు.