భూముల రీ సర్వేకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శ్రీకారం

 వైయ‌స్ఆర్‌‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ప్రారంభం ‌
 

కృష్ణా జిల్లా :  వైయ‌స్ఆర్‌ ‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీ ఫోర్స్‌కి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపి, రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ఆరంభించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది.  

వందేళ్ల తర్వాత..
భూ వివాదాలను చెరిపేందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.  వందేళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం మొదలైంది. ఎంతో కాలంగా పల్లె నుంచి పట్టణాల వరకు భూ వివాదాలు.. గట్టు వద్ద రైతన్నలు తరుచూ కీచులాటలు.. ఏళ్ల తరబడి సర్వే చేసే నాథుడే కనిపించలేదు. అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. భూమి ఒకరిదైతే  మరొకరు ఆక్రమించుకుని దౌర్జన్యం చేసిన ఘటనలు అనేకం. ఇలాంటి వివాదాల‌కు ఈ స‌ర్వే ద్వారా ఫుల్ స్టాప్ ప‌డ‌నుంది. 

Back to Top