చంద్ర‌బాబూ.. చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్ 

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి

క‌ర్నూలు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలి పోతారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందామని ఆయ‌న పిలుపునిచ్చారు. శుక్ర‌వారం కర్నూలు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసాలపై ప్రజలకు చైతన్య చేసి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా కోటి సంతకాల సేకరణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు దేశం పార్టీ నేతలు, మంత్రి నారా లోకేష్ పిపిపి విధానం తో 10 వేల కోట్ల రూపాయల విలువైన 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బినామీలకు క‌ట్ట‌బెట్టి దోచుకోవాలని చూస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టామని, త్వరలో నే రాష్ట్ర గవర్నర్ దృష్టి తీసుకొని వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Back to Top