చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు

రూ.118 కోట్ల లంచం తీసుకున్నట్టు ఐటీ శాఖ స్పష్టంగా తేల్చింది

ప్రజల నుంచి సింపథీ కోసం అరెస్టు చేస్తారంటూ బాబు కొత్త ఎత్తుగడ

కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, మేయర్‌ బీ.వై.రామయ్య 

కర్నూలు: చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మేయర్‌ బీ.వై.రామయ్య అన్నారు. గతంలో ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. తెలంగాణ నుంచి పారిపోయి కరకట్టకు వచ్చి తలదాచుకున్నాడని, ఇప్పుడు ఐటీ కేసులో ఇరుక్కొని ప్రజల నుంచి సింపథీ కోసం నన్ను అరెస్టు చేస్తారంటూ మాట్లాడుతున్నాడన్నారు. ఎల్లకాలం మోసం చెల్లదని, ఎక్కడో చోట పాపం పండినప్పుడు.. ఆ పాపానికి శిక్ష అనుభవించకతప్పదన్నారు. కర్నూలులో మేయర్‌ బీ.వై.రామయ్య మీడియాతో మాట్లాడారు. మనోజ్‌ వాసుదేవ్‌ అనే వ్యక్తిపై సోదాలు జరిపినప్పుడు ఏయే కంపెనీల ద్వారా ఎంతెంత లంచం తీసుకున్నారో చాలా స్పష్టంగా ఐటీ శాఖ గుర్తించిందన్నారు. పీఏ శ్రీనివాస్‌ను మనోజ్‌ వాసుదేవ్‌కు పరిచయం చేసి చంద్రబాబు కమీషన్లు రాబట్టుకున్నాడని స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఐటీ శాఖ తేల్చిందన్నారు. 

తాత్కాలిక సచివాలయం నిర్మాణం సమయంలోనే చంద్రబాబు దోపిడీ గురించి వైయస్‌ జగన్‌ వివరించారని, ఎంతమంచి క్వాలిటీతో నిర్మించిన చదరపు అడుగుకు రూ.4 వేలు మించి ఉండదని, కానీ చంద్రబాబు రూ.11 వేలు, రూ. 12 వేల చొప్పున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడని వివరించారని బీ.వై.రామయ్య గుర్తుచేశారు. ట్యాక్స్‌ కట్టకుండా షెల్‌ కంపెనీల ద్వారా రూ.118 కోట్ల లంచం చంద్రబాబు తీసుకున్నాడని చాలా స్పష్టంగా బయటపడి కేసు నమోదైందన్నారు. చంద్రబాబు దోపిడీ బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో సింపథీ కోసం ప్రయత్నం చేస్తున్నాడన్నారు.

ఇటీవల కాలంలో అన్ని రకాల సర్వే రిపోర్టులు వైయస్‌ఆర్‌సీపీకి మద్దతుగా వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమేనని మేయర్‌ బీ.వై.రామయ్య గుర్తుచేశారు. దాన్ని జీర్ణించుకోలేక కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో డైరెక్ట్‌గా మీటింగ్‌లలో రెచ్చగొట్టే ధోరణి మొదలుపెట్టాడన్నారు. ఏ మీటింగ్‌లోనైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ‘అంతుచూస్తాం, బట్టలూడదీస్తాం, తాటతీస్తాం, ఎవ్వరినీ బతకనివ్వం’ అనే దుర్మార్గమైన మాటలను చంద్రబాబు, ఆయన దత్త, సొంత పుత్రులు సైతం మాట్లాడుతున్నారని చెప్పారు. వీరికి తోడు ఎల్లో మీడియాలో విచ్చలవిడిగా రాతలు రాస్తూ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. 

ఏరకంగా చూసినా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవుతుందని, ఏదో రకంగా ప్రజల నుంచి సింపథీ రాబట్టుకోవాలని, ఐటీ కేసులో పారిపోవడానికి వీల్లేక అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశాడన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. 
 

Back to Top