గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ

విజయవాడ: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం ఆమోదించారు. ఏపీలో గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను  జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top