క్షత్రియుల‌మంతా మీకు తోడుగా నిలుస్తాం

సీఎం వైయస్ జ‌గ‌న్‌కు క్ష‌త్రియ సేవా స‌మితి హామీ

అల్లూరి జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించిన సీఎంకు ధ‌న్య‌వాదాలు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి క్షత్రియ సేవా సమితి (ఏపీ, తెలంగాణ) ప్ర‌తినిధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్, సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రికి క్షత్రియ సేవా స‌మితి ప్ర‌తినిధులు ప్ర‌త్యేక ధన్యవాదాలు తెలిపి, మెమెంటో అందజేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించడంతో క్షత్రియులంతా అండగా ఉంటామని ముఖ్యమంత్రికి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్‌ పేరిచర్ల నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ వి.వెంకటేశ్వర రాజు, జాయింట్‌ సెక్రటరీ డివిఎస్‌ఎస్‌ఎన్‌.రాజు, ట్రెజరర్‌ పి.వెంకటేశ్వర రాజు, క్షత్రియ సేవా సమితి ఫెడరేషన్‌ చైర్మన్‌ సీహెచ్‌.వెంకటపతి రాజు, సెక్రటరీ డీఎస్‌ఎన్‌. రాజు, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top