విశాఖ: పార్టీ కోసం పని చేసే వారందరికీ సముచిత స్థానం ఉంటుందని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా కోలా గురువులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వై.వి. సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలిచిన వారిని గుర్తుంచుకొని వారికి తగిన న్యాయం చేస్తూ వస్తున్నారని అన్నారు.
పార్టీ కోసం శ్రమించే వారిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ విడిచిపెట్టలేదని వారికి సముచిత స్థానాలు ఇస్తూనే ఉన్నారని చెప్పారు. ఇందుకు కోలా గురువులే నిదర్శనమని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన గురువులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయనను మత్స్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారని తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన గురువులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సానుభూతి తెలియజేయడమే కాకుండా, డిసిసిబి చైర్మన్ పదవి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఇచ్చి ఆయనను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని తద్వారా బీసీల పట్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మక్కువను చాటుకున్నారని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడే వారిని వైయస్ జగన్ ఎప్పుడు తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చూడాలని, పేదలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. పార్టీలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన వాళ్ళు కొద్ది మందేనని పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరు బయటకు వెళ్లలేదని
ఆయన అన్నారు.