అనంతపురం : వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతి రెడ్డి గారు మహిళా లోకానికి స్ఫూర్తి అని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ అన్నారు. ఇవాళ వైయస్ భారతమ్మ గారి జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో అనంతపురంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని స్థానిక కమలా నగర్ లో ఉన్న నిరాశ్రయుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబాసలామ్ మాట్లాడుతూ..వైయస్ భారతి రెడ్డి గారు సాక్షి మీడియా చైర్ పర్సన్ గా ఉంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రతిభ కలిగిన వారికి "సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ల" పేరిట గుర్తించి వారిని సత్కరించటం గర్వించదగ్గ విషయం అన్నారు. పులివెందుల పట్టణంలో వేలాది మంది అనాధలకు ఆమె సొంత నిధులతో ఉచితంగా విద్యను అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని ముఖ్య నగరాల్లో అనాధ శరణాయాలను నడిపిస్తున్నారని, ఇలాంటి సేవాగుణం కలిగిన భారతమ్మ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానిషా, వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోగుల కైలాష్, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.