వచ్చేది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమే  

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి

కోడుమూరు నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత  నిర్మాణ సమావేశం 

 కోడుమూరు:  రాష్ట్రంలో  ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా అధికారంలోకి వచ్చేది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. కుడా మాజీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు  కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,  కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్ట‌ర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వ‌ర్యంలో  పార్టీ సంస్థాగత  నిర్మాణ సమావేశం నిర్వ‌హించారు .   ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్  గారి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా  క్రమపద్ధతిగా,  పారదర్శకంగా పూర్తిచేయడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న‌ట్లు చెప్పారు.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం రాక్ష‌స పాల‌న న‌డుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్య‌మేలుతోంది. ఈ అప్ర‌జాస్వామిక పాల‌న‌ను త‌రిమికొడ‌దామ‌ని,. రాజ‌న్న రాజ్యాన్ని వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకొని తెచ్చుకుందామ‌న్నారు.   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారికి గుర్తింపు కల్పించాలన్నదే మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలబడాలన్న సంకల్పంతోనే ఈ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అమలు చేస్తున్న “రెడ్ బుక్ రాజ్యాంగం” ద్వారా అరాచక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం అవసరమని అన్నారు. పంచాయ‌తీ, గ్రామ స్థాయిలో కమిటీలను త్వరిగతిన పూర్తి చేసి, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో పార్టీని మరింత పటిష్టం చేసి, రానున్న రోజుల్లో  వైయ‌స్ జ‌గ‌న్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ,వార్డు,మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాల‌న్నారు. ఉత్సాహవంతులు, పార్టీ కోసం పనిచేసే  సమర్థులైన నాయకులందరికీ సముచితమైన అవకాశాలు కల్పిస్తూ గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.  

గ‌జ‌మాల‌తో స‌త్కారం
వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, కోట్ల హర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, ఆదిమూల‌పు స‌తీష్, మాజీ ఎంపీ బుట్టా రేణుక‌, మాజీ ఎమ్మెల్యే మ‌ణిగాంధీని పార్టీ నాయ‌కులు గ‌జ‌మాల‌తో సత్క‌రించారు.  కార్య‌క్ర‌మంలో గూడూరు మున్సిపల్ చైర్మన్ జే వెంకటేశ్వర్లు, ఎంపీపీ సునీతమ్మ,జిల్లా ప్రధాన కార్యదర్శిలు హనుమంత్ రెడ్డి, కొంతలపాటు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు మధుశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతం, జిల్లా అధికార ప్రతినిధి జిల్లా అనుబంధం విభాగాల నాయకులు, పోలకుల ప్రభాకర్ రెడ్డి,మండల కన్వీనర్లు రమేష్ నాయుడు, సోమశేఖర్ రెడ్డి, మోహన్ బాబు, రామాంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు,కోడుమూరు గా అనుబంధ విభాగల అధ్యక్షులు, మండలాల అనుబంధ విభాగల నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top