మహిళల పేరు మీదే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ 

మంత్రి కొడాలి నాని 

కృష్ణా : రాష్ట్రంలో పేదలకు అందించే ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గురువారం గుడివాడలో పర్యటించిన మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడారు. కొన్ని చోట్ల న్యాయస్థానం స్టే ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అడ్డంకుల కారణంగా ఇళ్ళ స్దలాల పంపిణీ వాయిదా వేశామన్నారు. ఎవరు ఎన్ని కేసులు వేసినా వాటన్నింటిని పరిష్కరించుకొని మహిళల పేరునే రిజష్ట్రేషన్ చేసి ఇళ్ళస్దలాలు అందిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పనిలేని వారే తనపై అనవసర ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తనపై ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని తిడుతూనే ఉంటానని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top