కియోస్క్‌ను పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిశీలించారు.కియోస్క్‌లో ఉన్న ఫీచర్స్‌ను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. ఫిబ్రవరి నుంచి 3 దశల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరిలో 3,300 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌ నాటికి మరో 11,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. పంట వివరాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, భూముల వివరాలు వంటి అనేక సేవలను కియోస్క్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
 

Back to Top