పల్నాడు: పిడుగురాళ్ళ మండలం జూలకల్లులో దళిత మహిళ మనీషా అకాల మరణానికి టీడీపీ నేతలే కారణమని వైయస్ఆర్‌సీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించలేదు, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం జూలకల్లులో దళిత మహిళ మనీషా తన తండ్రి రేషన్ షాప్‌ను ఆయన చనిపోయిన తర్వాత తను చేసుకుంటుంది, కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారు, పైగా రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని బెదిరించడంతో తను ఆత్మహత్య చేసుకుంటానని కాలువలో దూకిందని సమాచారం అందింది. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు, ఆడపడుచులను మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తున్నారు, దేవుడి దయ వల్ల ఆమె క్షేమంగా బయటపడాలి, పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి, రేపు నేను, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్ళి అక్కడ నిజాలు తెలుసుకుంటాం, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హామీ ఇచ్చారు.