మైనారిటీ నేత సాధిక్ అలీ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన టీడీపీ నేత‌
 

వైయ‌స్ఆర్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి నేతలు వరుస షాక్‌లిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో ఈపరిణామం పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా తాజాగా క‌డ‌ప న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడు సాధిక్ అలీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయ‌న‌కు పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ కండువా కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌ రెడ్డి ముఖ్య అనుచరులు, టీడీపీ సీనియర్‌ నాయకులు ఆ పార్టీని వీడారు. వేంపల్లి మెదటి వార్డు మెంబర్‌ కొరివి రామ సుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. సతీష్‌ అనుచరులు జేరిపిటి సుధాకర్‌తో సహా 30 కుటుంబాలు టీడీపీని వీడారు. వైయ‌స్ఆర్‌సీపీ మాజీఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.  
  

Back to Top